బాలలపై లైంగిక వేధింపుల నిరోధ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

Smriti Irani
Smriti Irani

న్యూఢిల్లీ:లోక్‌ సభలో గురువారం పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించడానికి వీలు కల్పిస్తూ తీసుకొచ్చిన పోక్సో చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం లోక్‌కసభలో మాట్లాడుతు లైంగికదాడుల కేసులను వేగంగా విచారించేందుకు నిర్భయనిధి ద్వారా దేశంలో 1,023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.ఒక్కో కోర్టుకు రూ.75 లక్షలు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. 18 ఏళ్లలోపు వారికి పరస్పర అంగీకార శృంగార అనుమతి లేదని, బాల్యవివాహాల్లో భార్యపై భర్త లైంగికదాడికి పాల్పడినా నేరమేనని మంత్రి చెప్పారు. లైంగికదాడి చేసినవారు 16 ఏళ్లలోపువారైతే ఉరిశిక్ష విధించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. యాదాద్రిలో వెలుగుచూసిన చిన్నారుల లైంగిక దోపిడీ ఘటనను మంత్రి స్మృతి ఇరానీ సభలో ప్రస్తావించారు. యాదాద్రిలో 30 మంది పిల్లలకు శరీరమంతా సిగరెట్లతో కాల్చిన, ఇంజెక్షన్లతో పొడిచిన గుర్తులున్నాయి. వారి శరీరంలోకి హార్మోన్లు ఎక్కించారు. పిల్లలు గర్భం దాల్చకుండా ఉండటానికి మోచేయి పైభాగంలో చిన్న వైద్యపరికరాలను జొప్పించినట్లు తేలిందిగగ అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/