దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు

‘దిశ’ ఘటనపై రాజ్యసభలో చర్చ


Rajya Sabha Chairman M Venkaiah Naidu condemns Hyderabad veterinarian rape & murder case
venkaiah naidu
venkaiah naidu

న్యూఢిలీ: దిశ హత్యాచార ఘటనను ఉద్దేశించి రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..’హైదరాబాద్ లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు’ అని అన్నారు. ‘దిశ’ హత్యాచార ఘటనపై ఈ రోజు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరముందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన బాధితులకు న్యాయం జరగదని చెప్పారు. ‘ఇప్పుడు కొత్త బిల్లు తీసుకుకావడం కాదు.. ఇటువంటి దాడులను అరికట్టాలన్న రాజకీయ సంకల్పం మనకు కావాలి. సమర్థవంతమైన పరిపాలన నైపుణ్యాలు ఉండాలి. మనుషుల ఆలోచనా విధానం మారాలి.. అప్పుడే సామాజంలో ఇటువంటి చెడును సమూలంగా నాశనం చేయగలం’ అని వ్యాఖ్యానించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/