మరోసారి పాక్‌ కాల్పులు

తిప్పికొట్టిన భారత సైన్యం

Indian army
Indian army

శ్రీనగర్‌: భారత వాయుసేన బాలకోట్‌పై జరిపిన దాడుల తరువాత సరిహద్దుల్లో పాక్‌ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా పాకిస్థాన్‌ సైన్యం మరో దాడికి తెగబడింది. జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో పాక్‌ సైనికులు 11 గంటల ప్రాంతంలో తుపాకులు, మోర్టార్లతో దాడికి దిగారు. అయితే భారత సైన్యం కూడా మాటకు మాట తూటాకు తూటా అన్నట్లుగా ఎదురు దాడికి దిగింది. భారత సైనికుల దాటికి తాలలేక పాక్‌ సైన్యం తోక ముడిచింది. భారత జవాన్లు పాక్‌ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రతీసారి ధీటుగానే తిప్పి కొడుతున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/