భారత్‌లో ఆశ్రయం కోసం పాక్‌ మాజీ ఎమ్మెల్యే!

baldev kumar
baldev kumar

పాక్‌లో మైనార్టీలకు రక్షణకరవు-బల్‌దేవ్‌


ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే భారత్‌లో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నాలుచేస్తున్నాడు. ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బల్‌దేవ్‌ లూథియానాకు చెందిన ఖన్నా మహిళను వివాహాడారు. ఇప్పటికే తన భార్య భావనా సేథి, ఇద్దరు పిల్లలను, 11ఏళ్ల తలసీమియా బాధితురాలైన చిన్న పిల్లనుసైతం భారత్‌కు తరలించాడు. బల్‌దేవ్‌కుమార్‌ ప్రాణరక్షణకోసం సిక్కుగా పాకిస్తాన్‌లో నివసిస్తున్నట్లు తేలింది. ఖన్నా ప్రాంతానికి చెందిన బల్‌దేవ్‌ తన భార్యతోసహా వచ్చి భారత్‌లోనే ఆశ్రయం పొందేందుకు కృషిచేస్తున్నాడు. పాకిస్తాన్‌లో తనకు తన కుటుంబానికి రక్షణలేదని, ప్రధాని పిటిఐ పార్టీ తనపై కుట్రలుచేస్తోందని ఆరోపించాడు. ప్రాదేశిక అసెంబ్లీ స్థానానికి పిటిఐ అభ్యర్ధిగా స్వాత్‌ ప్రాంతంనుంచి బలదేవవ్‌కుమార్‌ప ఓటీచేసారు. పాకిస్తాన్‌లో మైనార్టీలకు ఎంతమాత్రం రక్షణలేదన్నారు. మెజార్టీ ముస్లింలు వారందరినీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. బల్‌దేవ్‌ పేరును కూడా పిటిఐ నేత హత్యకేసులో ఇరికించారని, ఎంపిఎ స్వరణ్‌సింగ్‌ హత్యకేసులో తనను ఇరికించారని ఆరోపిస్తున్నాడు. పాకిస్తాన్‌ సిక్‌ గురుద్వారా ప్రబంధక్‌కమిటీ సభ్యుడిగా న్న స్వరణ్‌సింగ్‌ పిఎస్‌జిపిసికి స్వల్పకాలంపాటు ఛైర్మన్‌గాకూడా పనిచేసారు. ఏప్రిల్‌ 22వ తేదీ స్వరణ్‌సింగ్‌ తన స్వస్థలం బానూర్‌కు వెళ్లగా అక్కడ ఆతణ్ణి కాల్చి చంపారు. సాయంకాలంసమయంలో బయటకు వెళ్లేందుకు వచ్చిన ఆతడిని కాల్చినట్లు తేలింది.స్వరణ్‌సింగ్‌, బల్‌దేవ్‌కుమార్‌ రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/