చిదంబరంకు కస్టడీ పొడిగింపు

ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి

P Chidambaram
P Chidambaram

ఢిల్లీ: మాజీ మంత్రి చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో మరోసారి నిరాశ పరిచింది. చిదంబరం జ్యుడిషియల్‌ కస్టడీని డిసెంబర్‌ 11 వరకు బుధవారం నాడు ఢిల్లీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతున్న నేపథ్యంలో చిదంబరం జ్యుడిషియల్‌ కస్టడీని మరో 14 రోజులు పోడిగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడి కోరింది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్‌ కుహర్‌ చిదంబరం జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించారు. అయితే ఈ అభ్యర్థనకు చిదంబరం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/