క్షణాల్లో నేలమట్టమైన వాటర్‌ ట్యాంక్‌

Overhead water tank
Overhead water tank

బంకుర: పశ్చిమ బెంగాల్‌లోని బంకుర జిల్లా సరేంగా ప్రాంత పరిధిలో ఉన్న ఏడు లక్షల లీటర్లు సామర్థ్యమున్న భారీ వాటర్ ట్యాంకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ వాటర్ ట్యాంకును 2016లో నిర్మించారు. దీనికి పగుళ్లు వచ్చి, కూలిపోయే దశకు చేరుకున్న అధికారులు పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ ట్యాంకు కుప్పకూలిపోవడంతో లక్షల లీటర్ల నీరు వృథాగా అయింది. ఈ వాటర్ ట్యాంకు ద్వారా దాదాపు 15 గ్రామాలకు తాగునీరు సరఫరా అయ్యేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా ట్యాంకు కూలిపోవడంతో చుట్టపక్కల ఉన్న గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంక్ నిర్మించిన నాలుగేండ్లకే కూలిపోవడం ఏంటని..? ప్రజలు అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో నిర్మాణ పనులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీళ్ల ట్యాంకు కూలిపోవడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని అధికారులు అంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/