అత్యాచారం కేసుల కోసం 1000 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

smriti irani
smriti irani

న్యూఢిల్లీ: మైనర్లతో సహా అత్యాచారం కేసులను త్వరితగతిన విచారించడం మరియు నివారణ కోసం 1023 ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులను (ఎఫ్‌టిఎస్‌సి) ఏర్పాటు చేసే పథకాన్ని రుపొందించినట్లు మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఈ పథకానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు రూ.767.25 కోట్లు ఖర్చవుతుందని స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమధానం ఇచ్చారు. ఇందులో కేంద్రం రూ.474 కోట్లు సమకూరుస్తుందని ఆమె చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో 218 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ విషయంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/