మహాకూటమితో బ్రేకప్‌ శాశ్వతం కాదు..తాత్కాలికమే

Mayawati
Mayawati

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖీలేష్‌ యాదవ్‌, ఆయన భార్య డింపుల్‌ యాదవ్‌ తనకు ఎంతో గౌరవం ఇచ్చారని బహుజన్‌ సమాజ్‌ పార్టీ ( బీఎస్పీ) అధినేత్రి మాయావతి అన్నారు. తమ మధ్య బంధం రాజకీయాల కోసం కాదు.. ఈ స్నేహబంధం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుందని మాయావతి తేల్చిచెప్పారు.దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ మధ్య ఉన్న విబేధాలన్నింటిని మరిచిపోయామని ఆమె తెలిపారు.మహాకూటమి బ్రేకప్ శాశ్వతం కాదు.. తాత్కాలికమేనని మాయావతి స్పష్టం చేశారు. అఖిలేష్ యాదవ్ భవిష్యత్‌లో మంచి విజయాలు సాధిస్తే అతనితో కలిసి పని చేస్తాం. ఒక వేళ అతను విజయం సాధించలేకపోతే ఒంటరిగానే ముందుకెళ్తాం. మొత్తానికి త్వరలో యూపీలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని మాయావతి స్పష్టం చేశారు

.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక చేయండి:https://www.vaartha.com/telengana/