ఎన్డీయేతర పక్షాల నేతల భేటి ప్రారంభం

opposition-leaders
opposition-leaders

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఎన్డీయేతర పక్షాల నేతలు సమావేశమయ్యారు. అయితే వీరంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న పక్షపాత ధోరణిపై చర్చించేందుకు భేటి అయ్యారు. ఈసమావేశంలో మొత్తం 19 పార్టీలకు చెందిన నేతలుపాల్గొన్నారు. కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌, అశోక్‌ గెహ్లోత్‌‌, అభిషేక్‌ మను సింఘ్వీ, ఆప్‌ నుంచి దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఆ పార్టీ నేత సంజయ్‌సింగ్‌, టిడిపి నుండి సిఎం చంద్రబాబు నాయుడు, సీపీఐ నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నేత కణిమొళి, ఆర్జేడీ నేత మనోజ్‌ ఝూ, ఎన్సీపీ నుంచి ప్రఫుల్‌ పటేల్‌, ఎస్పీ నుంచి రామ్‌కృపాల్‌ యాదవ్‌, టీఎంసీ నుంచి డెరెక్‌ ఒబ్రెయిన్‌, బీఎస్పీ నుంచి సతీశ్‌చంద్ర మిశ్రా, ఎస్పీ నుంచి దేవేందర్‌రాణా తదితరులు హాజరయ్యారు. సమావేశం ఆనంతరం వీరంతా ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/