2025 నుండి ఎలక్ట్రిక్‌ బైక్‌లు, స్కూటర్లు

bikes-scooters
bikes-scooters

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్త చర్యలు చేపట్టనున్నది. ఈ సందర్భంగానే ఇక నుండి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, బైక్‌లను అమ్మేందుకు ప్లాన్‌ చేస్తుంది. అయితే దీనిలో భాగంగానే 2023 నుంచి ఎల‌క్ట్రిక్‌ త్రీవీల‌ర్స్‌, 2025 నుంచి టూవీల‌ర్స్‌ను అమ్మేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. టూ వీల‌ర్స్‌ను కేవ‌లం 150 సీసీ ఇంజిన్‌తో మాత్ర‌మే అమ్మాల‌ని భావిస్తున్నారు. విప‌రీతంగా పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/