ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

terrorists
terrorists

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. నౌగాం ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.