ఒకే దేశం ఒకే భాష!

amith shah
amith shah


అమిత్‌ షా కొత్త నినాదం


న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నికల అన్న రీతిలో ఇప్పుడు తాజాగా ఒకే దేశం ఒకే భాష ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఒక భాష ద్వారా భారత్‌ను ప్రపంచదేశాల సరన నిలపొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ అని. ఈ భాషతో దేశం మొత్తాన్ని ఏకం చేయవచ్చని చెప్పారు. అంతేకాక హిందీని ప్రాథమిక భాషగా చేయాలని కూడా ఆయన అన్నారు. భారత్‌లో చాలా భాషలు ఉన్నాయి. ఏ భాషకు ఉన్న ప్రాధాన్యత ఆ భాషకు ఉందని, అయితే భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ఒక భాష ఉండాలని ఆయన అన్నారు. అత్యధికులు హిందీ మాట్లాడతారు కాబట్టి ఒకే భాషగా హిందీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లభా§్‌ు పటేల్‌ల కలలు సాకారం చేసేందుకు దేశ ప్రజలు హిందీ విరివిగా మాట్లాడాలని అమిత్‌షా అన్నారు. హిందీ దివస్‌ సందర్భంగా బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌లో అత్యధిక ప్రజలు హిందీ మాట్లాడతారని, హిందీని అతి సులభంగా అర్ధం చేసుకోవచ్చని కూడా ఆయన అన్నారు. దైనందిన జీవితంలో హిందీని విరివిగా వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/