అజిత్ ధోవ‌ల్‌కు క్యాబినెట్ హోదా

NSA Ajit Doval
NSA Ajit Doval

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ ధోవల్‌కు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్‌ హోదాను కల్పించింది. దేశ భద్రత కోసం అజిత్‌ ధోవల్‌ చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. అంతేకాక అజిత్‌ ధోవల్‌ను మరో అయిదేళ్ల పాటు పొడగిస్తున్నట్లు ఈరోజు ప్రభుత్వం వెల్లడించింది. 2014లో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా ధోవ‌ల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2016లో స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్‌తో పాటు ఈ ఏడాది బాలాకోట్ దాడులు కూడా ధోవ‌ల్ నేతృత్వంలో జ‌రిగాయి. 1968 బ్యాచ్‌ ఐపీఎస్ ఆఫీస‌ర్ అయిన ధోవ‌ల్ ఎక్కువ శాతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేశారు. పాక్‌లో ఆరేళ్లు ఉన్నారు . 1988లో కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. ఈరోజు అజిత్‌ ధోవల్‌ కేంద్ర హోంశాఖ కార్యాల‌యానికి వ‌చ్చారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/