ఇందిరా గాంధీ తరువాత నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీ: ప్రధాని మోడి కేబినెట్లో ఈ సారి ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బాధ్యతలు చేపట్టింది. అయితే కేంద్ర కేబినెట్‌లో ఆర్థికశాఖ చాలా కీలకమైనది. కాగా 1970-71లో ఇందిరా గాంధీ అర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె తరువాత నిర్మలా సీతారామన్‌ ఈశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.తమిళనాడులో అర్థశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన నిర్మల ఢిల్లీలోని జెఎన్‌యు నుంచి ఎంఫిల్‌ చేశారు. నిర్మలకు ఇంతకు ముందే ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అనుభం ఉంది. వాణిజ్య శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/