వెల్లూరులో ఎన్నికల రద్దుకు ఆదేశించలేదు

Election Commission
Election Commission

వెల్లూరు: తమిళనాడులోని వెల్లూరులో భారీగా నగదు పట్టుబడటంతో అక్కడ ఎన్నికలు రద్దు చేసే ఆలోచనలో ఈసీ ఉన్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈసీ తెలిపింది. కాగా కొన్ని రోజుల క్రితం జరిగిన ఈసీ, ఐటీ సోదాల్లో డీఎంకే పార్టీ కార్యాలయంలో భారీగా నగదు పట్టుబడ్డట్లు సమాచారం. ఈ సోదాల్లో సూమారు రూ.11 కోట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/