గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని మోడికి ఊరట

Narendra Modi
Narendra Modi

గాంధీనగర్‌(గుజరాత్‌): నానావతి కమిషన్‌ ప్రధాని మోడికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 2002లో గుజరాత్‌లో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు కొందరు దుండగులు నిప్పంటించడంతో చాలా మంది చనిపోయారు. ఈ అల్లర్లలో మరణించిన వారిలో హిందువుల కంటే ముస్లింలు అధికంగా ఉన్నారు. అప్పటి గుజరాత్‌ సిఎం నరేంద్ర మోడి ఈ అల్లర్లపై విచారణకు కమిషన్‌ను 2002లోనే వేశారు. మూడు రోజులపాటు సాగిన హింసను పోలీసులు ఏ మాత్రం నియంత్రించలేకపోయారని కమిషన్‌ అభిప్రాయపడింది. సదరు పోలీసు అధికారులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా ఈ ఘటనతో అప్పటి రాష్ట్ర మంత్రులెవరికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. నానావతి కమిషన్‌ రిపోర్టును ఈ రోజు గుజరాత్‌ అసెంబ్లీ టేబుల్‌పై ఉంచారు. ఐదేళ్ల క్రితం కూడా రిటైర్డ్‌ జస్టిస్‌లు నానావతి, అక్షయ్ మోహతాలు ఈ ఘటనకు సంబంధించిన తుది నివేదికను అప్పటి ఆనందిబెన్‌ ప్రభుత్వానికి సమర్పించింది. తాజా నివేదిక ప్రకారం ప్రధాని మోడికి ఇందులో ఎలాంటి సంబంధం లేదని నానావతి కమిషన్‌ ఊరట కల్పించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/