శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించే ఆలోచన లేదు

కేరళ దేవాదాయ శాఖ మంత్రి వ్యాఖ్య

sabarimala ayyappa temple
sabarimala ayyappa temple

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై వివాదానికి సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులున్న విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం విదితమే. కాగా తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్‌ మాట్లాడుతూ.. శబరిమల అయ్యప్పను దర్శించుకునే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పించలేదని స్పష్టం చేశారు. అందువల్ల ప్రస్తుతానికి దేవాలయం వద్ద స్థితిని ఎప్పటిలాగే కొనసాగించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశా§్‌ు ఈ నెల 16న అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకుంటానని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేంద్రన్‌ శబరిమల ఆలయానికి ఎవరైనా వెళ్లాలి అనుకుంటే కోర్టు ఆదేశాలు తెచ్చుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. మరోవైపు కేరళ సిఎం పినరయి విజయన మాట్లాడుతూ.. కోర్టు తీర్పు విషయంలో ఉన్న అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసుకున్న తర్వాత మహిళల ప్రవేశంపై ఆలోచిస్తామని చెప్పారు.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/