ఇప్పుడు రావాల్సిన పని లేదని లేఖ రాసిన ఈడీ

Sharad Pawar
Sharad Pawar

ముంబయి: ఈ మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి వెళ్తానంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవార్ కు ఈడీ లేఖ రాసింది. ఈడీ కార్యాలయానికి ఇప్పుడు రావాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొంది. భవిష్యత్తులో మీ అవసరం ఉన్నప్పుడు పిలుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి తాను వెళ్లడం లేదని శరద్ పవార్ ప్రకటించారు. పార్టీ శ్రేణులు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. రూ. 25 వేల కోట్ల మనీలాండరింగ్ కేసులో శరద్ పవార్ పేరును కూడా ఈడీ చేర్చింది. ఈ నేపథ్యంలో, ఈడీ తనకు సమన్లు జారీ చేయనప్పటికీ… ఈడీ కార్యాలయానికి వెళ్తానంటూ ప్రకటించి, మహారాష్ట్ర ఎన్నికల వాతావరణంలో మరింత వేడిని పుట్టించారు శరద్ పవార్.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/