ఆధార్‌కార్డు ఉంటనే సామాన్యులు సచివాలయంలోకి

uttarakhand-secretariat
uttarakhand-secretariat

డెహ్రాడూన్‌: సామాన్యూలు సచివాలయంలోకి అడుగు పెట్టాలంటే ఆధార్‌ కార్డు ఉంటేనే సచివాలయంలోకి అనుమతించాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు చూపితేనే సచివాలయంలోని అనుమతించాలని ఈ నెల 11న ఉత్తరాఖండ్ సెక్రటేరియట్ ఉత్తర్వులిచ్చింది.అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్పష్టం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సచివాలయంతో పాటు రైల్వేస్టేషన్లు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. సచివాలయం భద్రత కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, సామాన్యులు ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలని సీఎం కోరారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/