జపాన్‌ జీ-20 సదస్సుకు నిర్మాలా సీతారామన్‌

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీ: జూన్‌ 8న జపాన్‌లోని ఫకువొకా నగరంలో ప్రారంభం కానున్న జీ-20 సదస్సులో భారత్‌ తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొననున్నారు. ఈ సదస్సులో దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్‌ గవర్నర్ల సమావేశం కానున్నారు. అయితే గతవారం బాధ్యతలు స్వీకరించిన సీతారామన్‌కు ఇది తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. ఆమెతో పాటు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో అంతర్జాతీయ మార్కెట్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, మౌలిక రంగం, పన్నుల అంశాల్లో నెలకొన్న సంక్లిష్టతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే కొన్ని దేశాలు వారి వాణిజ్య విధానాల్లో అవలంబిస్తున్న రక్షణాత్మక ధోరణి అంర్జాతీయ వ్యాపారంపై దాని ప్రభావంగపై కూడా చర్చించనున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/