శశిథరూర్‌ను పరామర్శించిన నిర్మలా సీతారామన్‌

Shashi Tharoor ,r Nirmala Sitharaman
Shashi Tharoor, Nirmala Sitharaman

తిరువనంతపురం: కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ తలగాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ను పరామర్శించారు. ఈరోజు ఉదయం తిరువతంతపురం మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి వెళ్లి శశిథరూర్‌ను కలిశారు. ఖకేరళ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నప్పటికీ నిర్మలా సీతారామన్‌ ఆసుపత్రికి వచ్చి నన్ను పరామర్శించడం ఆనందంగా ఉంది. భారత రాజకీయాల్లో మర్యాద అనేది అత్యంత అరుదుగా కన్పించే గుణం. అందుకు ఈమె ఉదాహరణగా నిలిచారుగ అని శశిథరూర్‌ ఆమెని కొనియాడారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/