ఎంతమందిని ఉరితీస్తారు?

చంపడం సమస్యకు పరిష్కారం కాదు

Tanushree Dutta
Tanushree Dutta

ముంబయి: జనవరి 22వ తేదీ తీహార్‌ జైలులో చనిపోయే వరకూ నిర్భయ అత్యాచార దోషులను ఉరి తీయాలని పటియాలా హౌస్‌ కోర్టు ఆదేశాలు చేసింది. ఈ తీర్పుపై బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చానీయంశమైంది. అత్యాచార, హాత్య నిందితులను ఎంతమందిని ఉరితీస్తారని ఆమె కోర్టును, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాను ఈ సమస్యకు పరిష్కారం కోసం చూస్తున్నానని తెలిపింది. చంపడం సమస్యకు పరిష్కారం కాదని తనుశ్రీ దత్తా చెప్పింది. నిర్భయ కుటుంబానికి ఈ విధంగా జరిగి ఉండొచ్చు కానీ సమస్య అంతం కాలేదని తనుశ్రీ అభిప్రాయపడింది. కాగా నిర్భయ అత్యాచార నిందితులైన ముఖేశ్‌, పవన్‌ గుప్తా, వినయ శర్మ, అక్ష§్‌ు కుమార్‌లకు అదనపు సెషన్స్‌ జడ్జి డెత్‌ వారెంట్లు జారీ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/