మరోసారి నీరవ్‌మోడీకి బెయిల్‌ తిరస్కృతి

nirav modi
nirav modi

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీకి లండన్‌ కోర్టుమోసారి బెయిల్‌ను తిరస్కరించింది. నేరస్తుల అప్పగింతకింద మోడీని అప్పగించడంపై సవాల్‌ చేస్తూ నీరవ్‌మోడీ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ అప్పగింత పిటిషన్‌పై విచారణ వచ్చే ఏడాది మేనెల నుంచి ప్రారంభిస్తామని లండన్‌ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. 48 ఏళ్ల నీరవ్‌మోడీ లండన్‌లోని వెస్ట్‌మినిష్టర్‌కోర్టుకు హాజరయ్యారు. ఇంగ్లండ్‌లోని అత్యంత రద్దీగా ఉండే వాండ్స్‌వర్త్‌ జైలులో నీరవ్‌మోడీ రిమాండ్‌లోఉన్న సంగతి తెలిసిందే. గడచిన మార్చి 19వ తేదీనుంచి ఆయన జైలులో ఉన్నారు. ఈసారి నీరవ్‌మోడీకి హుగో కీత్‌ క్యూసి అనే న్యాయసంస్థ మోడీతరపున వాదిస్తోంది. ఆయనకు బెయిల్‌ మంజూరుచేయాల్సిన పరిస్థితులను మాత్రం బహిరంగపరచలేమని, విచారణపూర్తయ్యేంతవరకూ గోప్యంగానే ఉంచుతామని యుకెక్రౌన్‌ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ ప్రతినిధులు వెల్లడించారు. తనకకు తరచూ మానసిక అలజడి, నిస్సత్తువ, రక్తపోటు బాధిస్తున్నాయని, తనకు బెయిల్‌మంజూరుచేయాలని కోరుతూ వస్తున్న నీరవ్‌మోడీ అభ్యర్ధనలను లండన్‌ చీఫ్‌ మేజిస్ట్రేట్‌ఎమ్మా అర్బథ్‌నాట్‌ తిరస్కరించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/