వైష్ణోదేవి భక్తులకు శుభవార్త

indian train
indian train

 కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త.  ఢిల్లీ నుంచి కాట్రా వరకు ప్రయాణించే రెండవ వందే-భారత్‌ రైలును ప్రారంభించనుంది. దసరా నవరాత్రి ఉత్సవాల రోజుల్లో ఇది ప్రారంభం కానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే భారత్‌ మొదటి సెమీ హై స్పీడ్‌ రైలు వందే భారత్‌ ఢిల్లీ-వారణాసీ మధ్య నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ రైలు విజయవంతంగా నడుస్తుండటంతో ఇటీవలే భారత రైల్వే మరో 40 నూతన వందే-భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దేవి నవరాత్రుల్లో వైష్ణో దేవి  పవిత్ర దేవాలయాన్ని సందర్శించే లక్షలాది యాత్రికులకు అనుకూలంగా ఉండే ఢిల్లీ-కాట్రా వందే భారత్‌ రైలును నవరాత్రి రోజుల్లో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని పీయూష్‌ గోయల్‌ తన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.