జమ్మూకాశ్మీర్‌కు కొత్తగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

indian train
indian train

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు నవరాత్రి కానుకగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా న్యూఢిల్లీ నుంచి కట్రా వరకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రైలును స్వదేశీ పరిజానంతో తయారు చేశారు. మొదటి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్‌ 5 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఐఆర్‌సిటిసిలో టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. రైలు న్యూఢిల్లీ నుంచి కట్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవీ వరకు వెళుతుందని రైల్వేశాఖ చెప్పింది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో భక్తులు వైష్ణోదేవి ఆలయానికి సులభంగా చేరుకుంటారు. గాంధీజీ స్వదేశీ పిలుపు ఇచ్చారని ఈ రోజు స్వదేశీ రైలు ప్రారంభించడం ఆనందంగా ఉందని అమిత్‌ సా అన్నారు. ఒక్క మంగళవారం తప్ప మిగతా రోజులలో ఈ రైలు అందుబాటులో ఉంటుందన్నారు. ఇందులో 16 లగ్జరీ కోచ్‌లు ఉన్నాయి. ఇది ఇంజిన్‌ రహిత రైలు. అత్యంత వేగంతో దూసుకెళుతుంది. ప్రయాణ సమయాన్ని 40 శాతం తగ్గిస్తుంది. న్యూఢిల్లీ – వారణాసి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కాన్న ఈ కొత్త ట్రెయిన్‌లో ప్దె ప్యాంట్రీ ఉంది. రైలు మీదకు రాళ్లు రువ్వినా, రాళ్లతో దాడి చేసినా లోపల ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన గ్లాస్‌ను బిగించారు. 2022 నాటికి మరో 40 రైళ్లను పట్టాలెక్కిస్తామని రైల్వేశాఖ తెలిపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/