ఇకపై కాశీలో ‘డ్రెస్ కోడ్’ నిబంధనలు

భక్తులు జ్యోతిర్లింగాన్ని స్పర్శించాలంటే డ్రెస్ కోడ్ పాటించాల్సిందే

Kashi Vishwanath temple
Kashi Vishwanath temple

వారణాసి: వారణాసిలోని విశ్వేర్వుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ఇకపై డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. ఈ మేరకు కాశీ విశ్వనాథ ఆలయం నిర్ణయం తీసుకుంది. కాశీ విద్వత్ పరిషత్ తో సమావేశమైన అనంతరం ఆలయ పాలనా విభాగం నూతన నిబంధనలను ప్రకటించింది. గర్భగుడిలోని జ్యోతిర్లింగాన్ని స్పర్శించాలనుకునే భక్తులు సంప్రదాయక దుస్తులు ధరించాలని, పురుషులు ధోతీకుర్తా, స్త్రీలు చీర లాంటి ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ సంప్రదాయ దుస్తుల్లో రాని భక్తులను జ్యోతిర్లింగం స్పర్శదర్శనానికి అనుమతించమని, దూరం నుంచే దర్శించుకోవాలని పేర్కొంది. వారణాసి ఆలయంలో డ్రెస్ కోడ్ నిబంధనలు త్వరలోనే అమలు చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/