అమిత్‌షాతో భేటి కానున్న నూతన మంత్రులు

amit shah
amit shah

న్యూఢిల్లీ: కేంద్రంలో నూతన మంత్రివర్గం సవరణపై మోడి, అమిత్‌షా మరోసారి సమావేశమయ్యారు. అయితే గత మూడురోజులుగా వీరిద్దరు కలుసుకుని కేబినెట్ కసరత్తు సాగించడం ఇది మూడోసారి. కాగా, సమావేశం పూర్తికాగానే కేబినెట్‌లోకి తీసుకునే మంత్రులకు పిలుపు వెళ్తుందని, వారితో మధ్యాహ్నం 4.30 గంటలకు అమిత్‌షా భేటీ అవుతారని పార్టీ వర్గాల తాజా సమాచారం. కాగా, ఇప్పటికే అమిత్‌షా నుంచి ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్, నఖ్వి, పీయూష్ గోయల్‌ వంటి వారికి ఫోన్ కాల్స్ వెళ్లినట్టు తెలుస్తోంది.
మరోవైపు మంత్రివర్గంలో అమిత్‌షా చేరికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. త్వరలో మరికొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున పార్టీ అధ్యక్షునిగా ఆయనను కొనసాగించాలని ఆర్ఎస్ఎస్ అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే, తుది నిర్ణయాన్ని మాత్రం మోదీకే ఆర్ఎస్ఎస్ వదిలిపెట్టినట్టు చెబుతున్నారు


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/