30తో ముగియనున్న పాన్‌కార్డు-ఆధార్ అనుసంధానం గడువు


గడువు తర్వాత అనుసంధానం కాని పాన్‌కార్డులు రద్దు
త్వరపడాలంటూ అధికారుల సూచన

Aadhar -Pan Card
Aadhar -Pan Card

న్యూఢిల్లీ: పాన్‌కార్డును ఆధార్‌కార్డుతో అనుసంధానానికి ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఆ తర్వాత ఆధార్‌తో అనుసంధానం కాని పాన్ కార్డులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసే వారు ఆ సందర్భంగా పేర్కొనే ఆధార్ సంఖ్య మేరకు కొత్త పాన్‌ నంబరును జారీ చేస్తామని తెలిపారు. గడువుకు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో త్వరపడాలని, వెంటనే పాన్ నంబరుతో ఆధార్‌కార్డును జత చేసుకోవాలని అధికారులు సూచించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/