రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు, ప్రయాణికులు సురక్షితం

fire accident
fire accident

భువనేశ్వర్‌: ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా ఖంటపడ రైల్వేస్టేషన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైలు చివరి భోగీలో అంటే జనరేటర్‌ భోగీలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ భోగీని వేరు చేసి మంటలు వ్యాప్తి చెందకుండా సిబ్బంది నివారించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/