మేం ఎప్పుడు ఈ మాట అనలేదు

Rajnath Singh
Rajnath Singh

న్యూఢిల్లీ: బిజెపి 2014 ఎన్నికల్లో ప్రచారంలో ఎన్నో హామీలు ఇచ్చింది. అయితే ఇందులో ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకున్న విషయం నల్లధనాన్ని వెలికి తీస్తాం. ఆఆ డబ్బును దేశంలో అందరికీ పంచుతాం.. ఆ లెక్కన ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.15 లక్షలు వస్తాయి అని బిజెపి ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఎన్నికల వేళ అప్పుడు ఇచ్చిన హామీ ఏమైందంటూ ప్రతిపక్షాలు బిజెపిని నిలదీస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ విషయంపై హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. ప్రజల ఖాతాల్లోకి రూ.15 లక్షలు వస్తాయని మేము ఎప్పుడూ చెప్పలేదు. ఈ మాట ఎప్పుడూ అనలేదు. నల్లధనంపై చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పాం. చర్యలు తీసుకున్నాం. నల్లధనం వెలికితీత కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది మా ప్రభుత్వమే అన్నది గుర్తుంచుకోవాలి అని రాజ్‌నాథ్ అన్నారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ వివిధ అంశాలపై స్పందించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/