నిర్మలా సీతారామన్‌ కామెంట్లపై నెటిజన్ల సెటైర్లు

nirmala sitharaman
nirmala sitharaman


న్యూఢిల్లీ: దేశంలో కార్ల విక్రయాలు పడిపోవడానికి క్యాబ్‌లే కారణమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆటోమొబైల్‌ విక్రయాలు పడిపోవడానికి క్యాబ్‌లే కారణమని.. యవత కార్లు కొనేందుకు ఇష్టపడటం లేదని ఆమె పేర్కొన్నారు. కారు కొనుక్కుని ఇఎంఐ కట్టడం కన్నా క్యాబ్‌ బుక్‌ చేసుకోవడం మేలని అనుకుంటున్నారని తెలిపారు. అయితే కేంద్రమంత్రి కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. కార్ల కొనుగోళ్లకు క్యాబ్‌లు వాడటానికి సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ట్విటర్‌లో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దేశంలో ఆరోగ్యం, పరిసరాలు చాలా ముఖ్యమని గుర్తుచేస్తున్నారు. వాహనాల వాడకంతో కాలుష్యం అన్న విషయాన్ని విత్త మంత్రి మరిచిపోయినట్లున్నారు. ఆటోమొబైల్‌ విక్రయాలపై క్యాబ్‌లు కారణమనడం దారుణమన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌లో పని ఉన్నా లేకున్నా 80వేల మంది ఉద్యోగులున్నారని, కానీ ఆటోమొబైల్‌ విక్రయాలపై సాకులు చెప్పడం సరికాదన్నారు. మోడీ సర్కార్‌ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తన మేనిఫెస్టోను మరిచిపోయారా అని ప్రశ్నించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీల విక్రయాలు ఇటీవల రికార్డు స్థాయిలో క్షీణించిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/