ఝార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

Naxals
Naxals

రాంచీ: ఝార్ఖండ్‌లో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. సరయ్‌ కెల్లా లోని కుచాయ్‌ ప్రాంతంలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈబీ పేలుడుకు పాల్పడ్డారు.అయితే ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది జవాన్లకు గాయాలు అయినట్లు సమాచారం. ఝార్ఖండ్‌ పోలీసులు, 209 కోబ్రా బెటాలియన్‌కు చెందిన సిబ్బంది సంయుక్త ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు వీరిపై బాంబు దాడి చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌ సాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/