ఎన్‌కౌంట్‌లో నక్సల్‌ హతం

Naxal encounter
Naxal encounter

పాట్నా: ఈరోజు ఉదయం బీహార్‌లోని గయాలో ఎన్‌కౌంటర్ జరిగింది.205 కోబ్రా ట్రూప్స్, బీహార్ పోలీసులు కలిసి సంయుక్తంగా నక్సల్స్ కోసం కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో నక్సల్స్ పోలీసులకు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక నక్సల్ హతమయ్యాడు. ఘటనాస్థలిని నుంచి ఏకే 47 రైఫిల్, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల ఐఈడీ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. నక్సల్స్ కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి https://www.vaartha.com/news/national/