నౌకాదళ నావికుడు ఆత్మహత్య

Suicide
Suicide

ముంబయి: మహారాష్ట్రలోని లోనావాల ప్రాంతంలో గల ఐఎన్‌ఎస్‌ నావాల్‌ స్టేషన్‌లో నౌకదళ నావికుడు ఆకాశ్‌ సాయినాథ్‌ కన్నాలా(19) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆకాశ్ సాయినాథ్ డైరెక్ట్ ఎంట్రీ ఇంజినీరింగ్ మెకానిక్స్ కోర్సులో శిక్షణ పొందుతున్నాడు. మృతుడు తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా పార్థి గ్రామనికి చెందిన వాడు. సంఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదు. ఘటనపై నేవీ విచారణకు ఆదేశించింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/