గోవాతీరంలో కూలిన మిగ్‌-29కే యుద్ధ విమానం

MiG-29K-aircraft-crashed-in-Goa
MiG-29K-aircraft-crashed-in-Goa

పణాజీ: భారత నౌకదళానికి చెందిన మిగ్‌-29 కె శిక్షణ యుద్ధ విమానం ఆదివారం గోవా తీరంలో కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్‌లు క్షేమంగా బయటపడ్డారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. రోజువారి శిక్షణలో భాగంగా బయలుదేరిన ఈ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. అయితే పైలట్ల చాకచ్యంతో జనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. వారు కూడా వెంటనే బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణకు ఆదేశించామని భారత నౌకదళం వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/