బిజెపి నూతన అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారు!

  • డిసెంబర్ 31న జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
bjp
bjp

న్యూఢిల్లీ: బిజెపి పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 31న పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలిపారు. సెప్టెంబర్ లో 8 లక్షల బూత్ లకు ఎన్నికలు జరుగుతాయని… అక్టోబర్ లో మండల స్థాయి ఎన్నికలు, నవంబర్ లో జిల్లా స్థాయి ఎన్నికలు, డిసెంబర్ 15న రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుగుతాయని… చివరగా డిసెంబర్ 31న జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆయన చెప్పారు. అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న ఏకైక పార్టీ బీజేపీనే అని తెలిపారు. సాధారణ స్థాయి నుంచి వచ్చిన మోదీ ప్రధాని అయ్యారని, అమిత్ షా జాతీయ అధ్యక్షుడు అయ్యారని… ఒక బిజెపి లోనే ఇది సాధ్యమని చెప్పారు


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/