నరేష్‌ గోయల్‌ను విచారించిన ఇడి

naresh goyal
naresh goyal


న్యూఢిల్లీ: విదేశీ మారకద్రవ్య నిబందనల ఉల్లంఘన కింద నరేష్‌గోయల్‌ను ఫెమా చట్టంపరిధిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సుక్రవారం విచారణ కొనసాగించారు. మొట్టమొదటిసారి నరేష్‌ గోయల్‌ను విచారణకు పిలిపించింది. గత ఏడాది ఆయన ఇళ్లు ఆఫీసులు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వమించిన ఇడి ఫిర్యాదులపై విచారణకు రావాలన ఇసమన్లు జారీ చేసింది. గోయల్‌ వాంగ్మూలాన్ని ఫెమా చట్టంపరిధిలోనే ఏజెన్సీ జోనల్‌ కార్యాలయంలో రికార్డుచేసింది. గోయల్‌కు ముంబయి నివాసంతోపాటు డజనుకుపైగా స్థిరాస్తులున్నాయి. ఆయన గ్రూప్‌కార్యాలయాలు, వాటి డైరెక్టర్లు, జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యాలయాల్లో ఇడి విస్తృత సోదాలు నిర్వహించింది. బిజినెస్‌ సామ్రాజ్యం మొత్తం 19 ప్రైవేటు కంపెనీలున్నాయి. వాటిలో ఐదు విదేశాల్లోనే రిజిష్టరు అయ్యాయి. విదేశాల్లో రిజిస్టరు అయిన కంపెనీలు సందేహాస్పద లావాదేవీలునిర్వహించాయని, అమ్మకాలు, పంపిణీ,నిర్వహణ ఖర్చులు, అమ్మకాలసొమ్ము బదలాయింపు వంటివాటిపై విదేశీ మారకద్రవ్య చట్టం నిబందనలు ఉల్లంఘించినట్లు ఇడి అధికారులు భావిస్తున్నారు. ఈ కంపెనీల ఖర్చులు బోగస్‌లెక్కలతో ఉన్నాయని, ఎక్కువ ఖర్చులుచూపించాయని,ఈమొత్తాలను చూపించి భారీ నష్టాలు వచ్చినట్లు చెపుతున్నారని ఇడి అభియోగాలు నమోదుచేసింది.
తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/