పూర్వ వైభవాని తిరిగి సాధిస్తాం !

Narendra Modi
Narendra Modi

అహ్మదాబాద్‌: ప్రధాని నరేంద్రమోడి ఆదివారం అహ్మదాబాద్‌లోని బిజెపి నగర కార్యాలయ ప్రాంగణంలో ఆ రాష్ట్ర బిజెపి విభాగం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మన దేశం కోల్పోయిన గత వైభవాన్ని తిరిగి సాధించుకొనేందుకు, ప్రపంచంలో ప్రముఖ స్థానంలో నిలిపేందుకు ప్రజలిచ్చిన తాజా తీర్పు అవకాశం కల్పించిందని మోడి తెలిపారు. ఎన్నికల్లో భారీ విజయం అందించినందున మరింత వినమ్రతతో ప్రజలకు సేవ చేయాలని కార్యకర్తలకు సూచించారు. వచ్చే అయిదేళ్లు మన దేశానికే కాదు ప్రపంచ దేశాలకు ఎంతో ముఖ్యమైనవని తెలిపారు. ఈ కీలక సమయంలో సంపూర్ణ ఆధిక్యం కలిగిన ప్రభుత్వం ఏర్పడటం అదృష్టంగా అభివర్ణించారు.ప్రపంచ దేశాల చెంత సమున్నతంగా నిలిచే అవకాశాన్ని తిరిగి పొందేందుకు ఇది సరైన సమయం. అది సాధిస్తామనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాచేతనను మేల్కొలిపేందుకు, దేశాన్ని ముందుకు నడిపేందుకు ఇదో పెద్ద అవకాశం. సమస్యల్లేని నవభారత నిర్మాణానికి ప్రతిన పూనాల్సిన సమయమిదేగగ అని ప్రధాని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను సైతం నిర్ఘాంతపోయేలా చేశాయని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/