శ్రీకృష్ణ సన్నిధిలో మోదీ తులాభారం

modi
modi

త్రిశూర్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కేరళలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రే కోచి వెళ్లిన మోదీ.. ఈ ఉదయం అక్కడి నేవీ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో త్రిశూర్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి గురువాయూర్‌ చేరుకుని ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో మోదీ తులాభార కార్యక్రమం జరిగింది.  ఆలయ దర్శనం తర్వాత బీజేపీ  రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన అభినందన సభలో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. అనంతరం కేరళ నుంచి మాల్దీవులు, శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే. మాల్దీవులు పర్యటనలో భాగంగా అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు.