మోడీ,అమిత్‌షాలిద్దరూ కృష్ణార్జునులే

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

RAJANIKANTH
RAJANIKANTH

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు ఇరువురూ కృష్ణార్జునులు వంటి వారని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వ్యాఖ్యానిం చారు.జమ్ముకశ్మీర్‌కు 370 రద్దుచేయడంపై ఆయన స్పందించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాసిన లిజినింగ్‌, లెర్నింగ్‌లీడింగ్‌ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మిషన్‌కశ్మీర్‌కు నా హృదయ పూర్వక శుభాకాంక్షలని, పార్లమెంటులో అమిత్‌షాప్రసంగం అద్భుతమని అమి త్‌షా మోడీ ఇద్దరూ కృష్ణార్జుల కాంబినేషన్‌ అని పేర్కొన్నారు. ఎవరె లాంటివారో వారికి మాత్రమే తెలుసు.మీకంతా శుభాలే కలగాలి అని కోరారు ఉపరాష్ట్రపతి గురించి మాట్లాడుతూ వెంకయ్యనాయుడు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తారని, ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అని కొని యాడారు కేంద్రహోంమంత్రి అమిత్‌షా, అటవీపర్యావరణమంత్రి ప్రకాష్‌ జావ ్‌డేకర్‌, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామి నాథన్‌లతోపాటు పలువురుప్రముఖులు హాజరయ్యారు. ఈసభలోనే ఉప రాష్ట్రపతి తన రాజకీయ వ్యక్తిగత విషయాలను నెమరువేసుకున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/