మూడోసారి పెరోల్‌ కోరిన నళిని!

nalini
nalini


చెన్నై: రాజీవ్‌ హత్య కేసులో దోషి నళిని కూతురు పెళ్లికోసం పెరోల్‌ పొందింది. పెరోల్‌ పొడిగించాలని రెండోసారి అడిగింది. అది కూడా తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు మూడోసారి కూడా పెరోల్‌ కావాలనడంతో కోర్టు తిరస్కరించింది. తన కుమార్తె వివాహం నిశ్చయం కాలేదని పెరోల్‌ ఇవ్వాలని కోరిన నళినికి కోర్టు నుండి చుక్కెదురయింది. పెరోల్‌ను మరోమారు పొడిగించాలని ఆమె తరఫున దాఖలైన పిటిషన్‌ను విచారించిన మద్రాస్‌ హైకోర్టు న్యాయమూరిర్తులు జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ ఎం నిర్మల్‌కుమార్‌ల ధర్మాసనం ససేమిరా అంది. ఈ సంవత్సరం జులైలో కుమార్తె పెళ్లి ఉందని జైలు నుండి పెరోల్‌పై బయటికి వచ్చిన నళిని వేలూరులో ఉంటూ కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నది. పెరోల్‌ ఆగస్టు 24తో ముగియనుంది. అయితే పెళ్లి ఇంకా నిశ్చయం కాలేదు. అందుకే మరో నెల రోజులు పెరోల్‌ కావాలని ఆమె కోరింది. మానవతా దృక్పథంతో కేసును పరిశీలించి, మరో మూడు వారాల పాటు పెరోల్‌ ఇస్తున్నట్లు న్యాయస్థాం వెల్లడించింది. ఈ గడువు ఈ నెల 15తో ముగియనుంది. అయితే పెళ్లి ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. మరో నెలరోజుల పాటు తాను బయట ఉండే అవకాశం కల్పించాలని ఆమె కోర్టును అభ్యర్థించింది. అయితే ఆమె పిటిషన్‌ను న్యాయమూర్తులు తోసిపుచ్చారు. 15వ తేదీ సాయంత్రం 6 గంటల కల్లా ఆమె వేలూరు జైలుకు చేరాల్సి ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/