ముంబయి తాజ్ హోటల్స్‌కు బాంబు బెదిరింపు

భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు

Mumbai- Taj Hotel

ముంబయి: మంబయిలో ఉన్న తాజ్‌మ‌హ‌ల్ హోట‌ల్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో హోట‌ల్ వ‌ద్ద గ‌ట్టి బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. పాకిస్థాన్‌లోని క‌రాచీ నుంచి ఆ ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. బాంబుల‌తో హోట‌ల్‌ను పేల్చివేస్తామ‌ని బెదిరించిన‌ట్లు మంబయి పోలీసులు చెప్పారు. ఈ నేప‌థ్యంలో హోట‌ల్‌తో పాటు స‌మీప ప్రాంతాల్లోనూ భ‌ద్ర‌త‌ను కట్టుదిట్టం చేశారు. బాంద్రాలో ఉన్న తాజ్ లాండ్స్ ఎండ్ హోటల్ కు కూడా బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో అక్కడ కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. గత అర్థ‌రాత్రి 12.30 నిమిషాల‌కు ఈ ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. కాగా ముంబయిలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ పై 2008లో భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/