ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరంగా ముంబయి

Mumbai Traffic
Mumbai Traffic

ముంబయి: టామ్‌ టామ్‌ అనే స్వతంత్ర సంస్థ నిర్వహించిన సేర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరంగా 2018కిగానూ తొలిస్థానంలో ముంబయి నిలిచింది.ప్రపంచ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో చేసిన సర్వే ప్రకారం ముంబయి అత్యంత రద్దీ నగరంగా నమోదైంది.ఖరద్దీ రహిత ప్రపంచంగ పేరుతో ఈ సంస్థ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనం చేసింది. ఈ సర్వే నివేదిక ప్రకారం.. ముంబయిలోకి ఏదైనా ప్రదేశానికి వెళ్లడానికి పట్టే కాలం 30 నిమిషాలు అనుకున్నట్లయితే రద్దీ కారణంగా ఉదయం పూట మరో 24 నిమిషాలు ఎక్కువ సమయం పడుతోంది. ఇక సాయంత్రం వేళల్లో అయితే 30 నిమిషాల ప్రయాణానికి మరో 31 నిమిషాలు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. టామ్‌ టామ్‌ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం ముంబయి 65% రద్దీతో మొదటి స్థానంలో ఉంది. 63%తో బొగోటా రెండో స్థానంలో, 56%తో మాస్కో మూడో స్థానంలో, 53%తో జకార్తా నాలుగు, 36%తో పారిస్‌ ఐదోస్థానంలో ఉన్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/