ఆలయంలో రాజకీయాలు చేయకుడదు

Robert Vadra
Robert Vadra

ముంబయి: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్డ్‌ వాద్రాకు దక్షిణ ముంబయిలోని ముంబా దేవి దర్శనం కోసం వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. దేవి దర్శనం కోసం ఆలయంలోకి వాద్రా వెల్లగానే భక్తులందరూ ‘మోడి.. మోడి..మోడి’ అంటూ నినాదాలతో స్వాగతం పలికారు. గుడిలోపలికి అడ్డుగుపెట్టగానే మోడి జిందాబాద్‌, భారత్‌ మాతాకి జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అయితే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆలయానికి పోలీసులు వచ్చి ఆయనను సురక్షితంగా బయటకు పంపించి వేశారు. ఈ సందర్భంగా వాద్రా మాట్లాడుతూ.. దేవీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడి వచ్చాను. ఆలయంలో రాజకీయాలు చేయడానికి రాలేదు. కుటుంబసభ్యులతో ఇక్కడి వచ్చి దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆలయంలో రాజకీయ కార్యకలపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించకుడదని ఆయన పేర్కొన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/