ఉగ్రదాడులు జరిగే అవకాశం :ఐబీ హెచ్చరిక

terrorists attack
terrorists attack

ఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు సంచాలనాత్మక తీర్పు అనంతరం దేశమంతా హై అలర్ట్‌ నెలకొంది. ప్రధానంగా అతి పెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చారిస్తున్నాయి. టెర్రరిస్టులు ప్రధానంగా మూడు రాష్ట్రాలపై గురి పెట్టినట్లు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ దాడులకు ప్రణాళికలు వేసుకున్నట్లు భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. ఈ మేరకు డాడులు జరగవచ్చని ఇంటిలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) సంస్థలకు చెందిన అధికారులు తెలిపారు. ఇప్పటికే భద్రతా దళాలకు సమాచారం అందజేశాం. ఈ ఉగ్రమూకలు పలు కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌, హిమచల్‌ ప్రదేశ్‌లు ప్రధానంగా ఉన్నాయి అని తెలిపారు. దీంతో పలు నగరాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/