అనారోగ్యంతో మళ్లీ ఆసుపత్రిలో ములాయం

mulayam singh yadav
mulayam singh yadav

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ మళ్లీ అనారోగ్యం పాలైనారు. దీంతో ఆయనను హుటాహుటిన సోమవారం రాత్రి చార్టెడ్‌ ఫ్లైట్‌లో తీసుకొచ్చి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ములాయంకు షుగర్‌ లెవల్స్‌ అధికంగా నమోదు కావడంతో ఆదివారం లక్నోలోని లోహియా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో సోమవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మళ్లీ సాయంత్రం వరకు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ..ఆయనను మేదాంత ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌ సియం యోగి ఆదిత్యనాథ్‌…ములాయం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/