కూతుళ్లతో తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య

Suicide

Maharasthra: కూతుళ్లతో సహా తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య పాల్పడిన విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బుల్దానా జిల్లా మాలేగావ్‌లో  నలుగురు కుమార్తెలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. బావిలో మహిళతో సహా నలుగురు కుమార్తెల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.