మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హతం!

terrorist attack
terrorist attack


శ్రీనగర్‌: మోస్ట్‌ వాంటెడ్‌ లష్కర్‌ ఉగ్రవాది ఆసిఫ్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య సోపోర్‌ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆసిఫ్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆసిఫ్‌ ఓ కారులో ప్రయాణిస్తుండగా చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయితే, అతను కారు ఆపకుండా దూసుకెళ్లాడు. దీంతో బలగాలు అతన్ని వెంబడించడంతో వారిపై ఆసిఫ్‌ ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లోని చిన్నారి ఆస్మాజాన్‌ కుటుంబీకులు ఉగ్రవాదుల బెదిరింపులకు భయపడకుండా పండ్ల దుకాణాన్ని తెరిచారు. దీంతో ఉగ్రవాది ఆసిఫ్‌, అతని అనుచరులు ఆస్మాజాన్‌ కుటుంబంపై కాఉల్పలు జరిపారు. ఈ కాల్పుల్లో 30 నెలల ఆస్మాజాన్‌ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/