సరిహద్దు వద్ద 2వేలకు పైగా పాక్‌ సైనికులు

SSG commandos
SSG commandos

న్యూఢిల్లీ: బోర్డర్ లో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచేలా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. తాజాగా పీవోకేలోని నియంత్రణ రేఖ వద్దకు భారీ ఎత్తున సైనికులను పంపించింది. నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో బాగ్, కోట్లీ సెక్టార్లలో 2 వేల మందికి పైగా సైనికులను మోహరింపజేసిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే, ప్రస్తుతం వీరు దాడి చేసే యత్నాల్లో లేరని, అయినా వీరి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. కశ్మీర్ లో ఉగ్రకార్యకలాపాలకు మళ్లీ ఆజ్యం పోస్తున్న పాకిస్థాన్… ఇదే సమయంలో బోర్డర్ లో బలగాలను పెంచుతుండటం గమనార్హం.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/