పార్టీని వీడేందుకు 15మంది ఎమ్మెల్యెలు సిద్ధం

Alpesh Thakor
Alpesh Thakor

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన పదకి రాజీనామా చేస్తున్నారు.అన్న తరుణంలో గుజరాత్‌లోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యెలు దాదాపు 15 నుండి 20 మంది పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు ఓబీసీ నేత అల్పేశ్‌ థాకూర్‌ తెలిపారు. అయితే కాంగ్రెస్ తీరు ఇలాగే ఉంటే, ఆ పార్టీ మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కు కూడా అధికారంలోకి రాదు అని అల్పేశ్ థాకూర్ అన్నారు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని ఉన్న‌ద‌ని, కానీ పార్టీ తీరు ఇలా ఉంటే దాంట్లో కొన‌సాగ‌లేమ‌ని, పార్టీ వ్య‌వ‌హార‌శైలి ప‌ట్ల ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశ‌లో ఉన్నార‌ని అల్పేశ్ తెలిపారు.ప‌టాన్ జిల్లాలోని రాధాన్‌పూర్ నుంచి థాకూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన అల్పేశ్‌.. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ఆ పార్టీని వీడారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/